హైద్రాబాద్‌లో అరెస్టులు…ప్రతిఘటనలు
తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపి ధోరణికి వచ్చేసింది.స్వరం వినిపిస్తే చాలు అరెస్టులు,దాడులతో భయపెట్టేందుకు సిద్ధమౌతుంది.ఇప్పటి వరకు ఏపిలో ఈ తంతు సాగుతూ వచ్చింది.ఇప్పుడు తెలంగాణా వంతు వచ్చేసింది అన్నట్లుగా వ్యవహరిస్తుంది రేవంత్ సర్కార్. నిరశన గళాల గొంతు నొక్కేందుకు పోలీసుల చేత కంచె వేయిస్తుంది. ధర్నాకు పిలువునివ్వడం ఆలస్యం ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేయిస్తుంది. ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు చేయిస్తూ ప్రజా ఆందోళనలపై ఉక్కు పాదం మోపుతున్నాయి. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పిలుపునిచ్చినందుకు ఎమ్మెల్సీ కవితను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. కవిత ఇంటి ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. మాజీమంత్రి హరీష్‌రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టులను బీఆర్ ఆఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి.