అంతర్ జిల్లా దొంగల ముఠాసభ్యుల అరెస్ట్
పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి భారీ ఎత్తున నగదు,నగలు,బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.దీని సంబంధించిన వివరాలను ఆ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు,ఈపూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చోరీలకు పాల్పడిన 9 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 25 లక్షల విలువ చేసే 18 బైకులు,170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి,LED టీవీలు,ట్రాన్స్ఫార్మర్స్ కేబుల్ వైర్లు,రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.