Home Page SliderTelanganatelangana,

కాల్స్ ఎక్కువ మాట్లాడితే అరెస్టు చేయడం పద్దతి కాదు..

తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ అరెస్టుకి సరైన ప్రాతిపదిక లేదని, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. ఈ కేసులో నిందితుడు సురేష్‌తో కేవలం 71 రోజుల్లో 84 కాల్స్ మాట్లాడడం వల్ల కొడంగల్ కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించినందని లాయర్ పేర్కొన్నారు. ఇది అన్యాయమని, ఒక్క హత్యాయత్నం కేసు తప్ప మిగిలిన సెక్షన్లన్నీ ఐదేళ్ల లోపు శిక్ష పడేవేనని అతనిపై కేసును క్వాష్ చేయాలని పేర్కొన్నారు. దీనిపై కోర్టు నిర్ణయం తెలియాల్సి ఉంది. నరేందర్ రెడ్డి తనకు ఈ కేసులో సంబంధం లేదని అన్యాయంగా కేసులో ఇరికించారని జైలు నుండి లేఖ రాశారు.