NewsNews AlertTelangana

తుపాకీతో కాల్చుకుని ఆర్మీ జవాన్ ఆత్మహత్య…

దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ, ప్రజల రక్షణ కోసం తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి గుండెను రాయి చేసుకొని ప్రాణాలను సైతం పట్టించుకోకుండా సరిహద్దుల్లో దేశ ప్రజల రక్షణ కోసం శత్రువులతో ధైర్యంగా పోరాడేవారు జవాన్లు. అలాంటిది బీహార్ లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. భారత సాయుధ దళాలలో ఒకటైన సశస్త్ర సీమా బల్ (SSB)కు చెందిన ఒక జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లా వీర్‌పూర్‌లో ఈ రోజు చోటుచేసుకుంది. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని 45వ ఎస్‌ఎస్‌బీ బెటాలియన్‌కు చెందిన జవాన్ చిమల్ విష్ణుగా గుర్తించారు. తెలంగాణకు చెందినవాడని అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియనుంది.