Home Page SliderNationalNews AlertPolitics

‘ముహూర్తం చూస్తున్నారా?’..మండిపడ్డ సుప్రీం కోర్టు

అస్సాం రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన విదేశీయులను వెంటనే పంపేయకుండా నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన విషయంపై సుప్రీంకోర్టు అస్సాం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని స్వస్థలాలకు పంపడానికి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా? అంటూ మండిపడింది. అస్సాం నిర్బంధ కేంద్రాలలో ఉంచిన 63 మందిని వెంటనే రెండు వారాలలోగా పంపించేయాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఎవరైనా దేశంలోని అక్రమంగా ప్రవేశించినవారిని పంపివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వారి చిరునామా తెలియదంటూ నిరాకరిస్తే, జీవితాంతం కేంద్రాల్లో ఉంచి పోషించగలమా? అంటూ ప్రశ్నించారు. అస్సాంతో సహా కొన్ని రాష్ట్రాలలో అక్రమ వలసదారులు పెరిగిపోయారని, దీనివల్ల స్థానికులలో అభద్రతాభావం పెరిగిపోతోందని పేర్కొన్నారు. తమ వనరులు పొరుగు దేశస్థుల పాలవుతున్నాయని, మైనారిటీలుగా మారిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వలసదారులు కొందరు మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. అంటూ వ్యాఖ్యానించారు.