HealthHome Page SliderNational

ఈ మందులు వాడుతున్నారా?

క్వాలిటీ స్టాండర్డ్స్‌లో ఫెయిల్ అయిన 49 రకాల మందులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అసోసియేషన్ CDSCO తెలియజేసింది. ఈ మందులను ఎవరూ వాడొద్దని హెచ్చరించింది. వాటిలో క్యాల్షియం-500ఎంజీ, విటమిన్ డి3 (లైఫ్ మ్యాక్స్), పారాసిటమల్(కర్ణాటక యాంటి బయాటిక్స్), డొంపరిడోన్(రైన్‌బో లైఫ్ సైన్సెస్), పాన్ -40 (అల్కెమ్ ల్యాబ్స్) వంటి అనేక రకాల మందులు ఉన్నాయి. ఇవే కాకుండా నకిలీ కంపెనీల ద్వారా మరో 4 రకాల మందులు చెలామణీలో ఉన్నాయని గుర్తించినట్లు తెలిపింది. రద్దు చేయబడిన, నిషేధించిబడిన మందుల జాబితాలను చెక్ చేసుకుని, ఔషధాలు కొనుగోలు చేయాలని పేర్కొంది.