Home Page SliderNational

సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా..?

ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసి కూడా చాలామంది సిగరెట్లు తాగుతుంటారు. ఇలాంటి ఎన్నో అలవాట్ల వల్ల జీవన శైలిలో భాగమైపోయి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే.. కొంత మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది ప్రమాదకరం. సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేస్తూ టీ తాగే వారికి గుండెపోటు వచ్చే చాన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని తాజాగా ఒక పరిశోధనలో తేలింది. టీలో ఉన్నటువంటి టాక్సిన్ సిగరెట్ పొగలో కలుస్తుందని, దానిని పీల్చడంవల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, కాళ్లు, చేతుల్లో బలహీనత, దీర్ఘకాలంలో స్పర్శ కోల్పోవడం, గుండె, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరగడం, సంతానలేమి, కడుపులో పుండ్లు వంటి సమస్యలు టీ తాగుతూ సిగరెట్ కాల్చేవారిలో వచ్చే అవకాశం ఎక్కువ.