కేంద్రం ఇచ్చే నిధులపై బహిరంగ చర్చకు రెడీయా?
తెలంగాణ (కరీంనగర్): ఎంపీగా గెలిపిస్తే సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత రూ.8 వేల కోట్లకు పైగా నిధులు తెచ్చానని, స్మార్ట్‌సిటీ, ఆర్వోబీ, రహదారుల నిర్మాణానికి, డ్రైనేజీ, సర్కస్ గ్రౌండ్, ఆర్ట్స్ కాలేజీల, మహిళా కాలేజీల అభివృద్ధి, రహదారుల విస్తరణ, స్మశాన వాటికలు, టాయ్‌లెట్లతో సహా కరీంనగర్‌లో అభివృద్ధి పనులన్నింటికీ నిధులు తీసుకొచ్చానని లెక్కలతో సహా వస్తా మీరు రెడీయా చర్చించుకుందాం అంటూ గంగుల కమలాకర్‌కు సవాల్ విసిరారు.