Home Page SliderNationalPoliticsTrending Today

“హిమాలయాలకు పోతున్నావా?”..మోదీ ప్రశ్నకు పవన్ షాక్..

ఢిల్లీ సీఎం రేఖాగుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏపీ నుండి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులను పరామర్శిస్తూ వేదికనలంకరించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దగ్గర కాసేపు ఆగి ముచ్చటించారు. దీనితో ప్రధాని ఏం మాట్లాడారా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు విలేకర్లు కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్‌ను ఈ విషయమై ప్రశ్నలు అడుగగా, ఆయన బదులిస్తూ, తన దీక్షా వస్త్రాలు చూసి, హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఉందా? అని ప్రధాని అడిగారని, దానికి ఇంకా సమయం ఉందని బదులిచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.