ఇవి తింటున్నారా? అయితే చేతులారా మీ లివర్ ని మీరే పాడు చేసుకుంటున్నట్లే…
మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం (లివర్) కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. లివర్ అనేది మన శరీరంలో జరిగే చాలా పనులను నియంత్రిస్తుంది. కానీ ఈ రోజుల్లో మద్యపానం సేవించనప్పటికీ కొన్ని ఆహార పదార్థాల వల్ల కాలేయం రిస్క్ లో పడుతున్నది. అవి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత చాలా వరకు బయటి ఫుడ్ ను బాగా తింటున్నారు. ఈ ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యం పాలు అవుతున్నారు. వాటిల్లో ముఖ్యమైనవి జంక్ ఫుడ్. బర్గర్, పిజ్జా, చిప్స్ వంటి ఫుడ్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ లు లివర్ లో పేరుకుపోయి అది కుళ్లిపోయేలా చేస్తాయి.
పాస్తా, వైట్ బ్రెడ్ ల వల్ల లివర్ కొలెస్ట్రాల్ తొందరగా పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలో ఎక్కువ శాతం కొవ్వు, ఉప్పు ఉంటాయి. కాలేయ ప్రమాదానికి ఇది కూడా పెంచుతుంది.
జ్యూస్, సోడా, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లలో ఎక్కువగా ఫ్రక్టోజ్ ఉంటుంది. వీటిని రోజు తీసుకుంటే ఫ్యాటీ లివర్ కు గురయ్యే అవకాశం ఉంది.
పాల ఉత్పత్తులు అనగా, పాలు, వెన్న, చీజ్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులలో అధిక కొవ్వు కలిగి ఉంటుంది. కాబట్టి ప్రాణ హాని కలిగినటువంటి ఫుడ్ ని కాకుండా హెల్తీ ఫుడ్ ని తీసుకోవడం మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

