HealthHome Page SliderTrending Today

మీకు 40 ఏళ్లు వచ్చాయా..? అయితే జాగ్రత్త !

మీకు 40 ఏళ్లు దాటాయా.? అయితే మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులకి 40 ఏళ్లు దాటితే చాలా రకాలైన సమస్యలు వస్తాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చురుకుదనం కూడా మునుపటిలా కాకుండా క్రమంగా తగ్గుతుంది. అందుకే 40 ఏళ్లు దాటిన తర్వాత ఆహారం, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తీసుకొని మధ్యాహ్నం లంచ్ సరిపడా తీసుకోవాలి. నైట్ డిన్నర్ మాత్రం మితంగా తీసుకోవడం ముఖ్యం. బ్రేక్ ఫాస్ట్, లంచ్ నిర్లక్ష్యం చేస్తే రాత్రి డిన్నర్ ఎక్కువగా తింటాం. దీని వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. టీ, కాఫీ తక్కువగా తీసుకోవాలి. షుగర్ ఉండే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

యువకుల కంటే 40 ఏళ్లు పైబడిన పురుషులలో తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 40 ఏళ్ల తర్వాత అజీర్ణం వల్ల గుండెల్లో మంట సమస్య వస్తుంది. 40 ఏళ్లు పైబడిన చాలా మంది పురుషులకు పొట్ట ఎక్కువగా వస్తుంది. వయస్సు పైబడే కొద్దీ కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కాల్షియం లోపం కారణంగా.. ఎముకల సాంద్రత తగ్గుతుంది. 40 ఏళ్ల తర్వాత మగవారిని టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే విజయవంతంగా ట్రీట్ మెంట్ చేయవచ్చు. ముందుగానే పురుషులు కాస్త జాగ్రత్తలు పాటిస్తే వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయాలి. యోగా, ధ్యానం, దీర్ఘ శ్వాస వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.