జూనియర్ ఎన్టీఆర్‌పై ఆ రూమర్స్ నిజమేనా?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్‌పై రకరకాల రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ చాలా సన్నగా, బక్కచిక్కినట్లు కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే ఆయన లైపో చేయించుకున్నారని, ఓజెంపిక్ చికిత్సలు చేయించుకున్నారని వచ్చిన రూమర్స్‌పై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఆయన ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోయే ఎన్టీఆర్ 31 మూవీ కోసం కొత్త డైట్ ఫాలో అవుతున్నారని పేర్కొంది. సినిమానే ప్రాణంగా భావించే తారక్ ఏం చేసినా సినిమాల కోసమేనని పేర్కొన్నారు. గతంలో యమదొంగ చిత్రానికి కూడా ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గడంతో వదంతులు వ్యాపించాయి. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి సలహా ప్రకారమే అప్పుడు బరువు తగ్గారని సమాచారం.