Andhra PradeshHome Page Slider

టీడీపీకి అసలు అభ్యర్థులు ఉన్నారా..?:వైసీపీ మంత్రి

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కాగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అసలు అభ్యర్థులే లేరని వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు.గతంలో చంద్రబాబు కూడా నియోజకవర్గాన్ని మారిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న దానిపై..సమావేశంలో మాకు భ్రీఫింగ్ ఇచ్చారు. కాబట్టి అదే ఫైనల్ అని అన్నారు.ఈసారి ఏపీలో ఉన్న 175 స్థానాల్లో విజయం సాధించాలనే అభ్యర్థుల మార్పు ప్రక్రియ చేపట్టామన్నారు. దీనిపై చంద్రబాబు మాటల్లో పొంతన లేదు అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకుపోయి జైలు కెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు.