‘హార్ట్ ఎటాక్’, ‘కార్డియాక్ ఎటాక్’ రెండూ ఒకటేనా?..
ఈమధ్య కాలంలో అనేకమంది సడన్‌గా గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల చిన్నవయసులోనే నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె ఇలాగే గుండెపోటుతో మరణించారు. అయితే హార్ట్ ఎటాక్, కార్డియాక్ ఎటాక్ రెండూ ఒకటేనా? లేదా తేడాలున్నాయా? అని చాలామందికి తెలియదు. అయితే ఈ రెండూ ఒకటే కాదంటున్నారు వైద్యులు. హార్ట్ ఎటాక్ వచ్చినట్లు రోగికి తెలుస్తుంది. భుజం, చెస్ట్ నొప్పి, శ్వాస ఆడకపోవడం, అలసట, యాంగ్జైటీ, వికారం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి తీసుకెళితే వారిని కాపాడే సమయం ఉంటుంది. అయితే దీనికంటే కార్డియాక్ అటాక్ చాలా ప్రమాదకరమైనది. ఉన్నట్టుండి హార్ట్ బీట్ ఆగిపోయి, రక్తం ఇతర అవయవాలకు పంప్ చేయలేకపోతే దానిని కార్డియాక్ ఎటాక్ అంటారు. ఈ ఎటాక్ వల్ల తల తిరిగినట్లనిపించి కిందపడిపోతారు. స్పృహ కోల్పోయి, శ్వాస ఆగిపోవడం, హార్ట్ బీట్ ఆగిపోవడం జరుగుతుంది.