Home Page SliderTelangana

సచివాలయానికి వాస్తు మార్పులు

తెలంగాణ సెక్రటేరియట్ లో స్వల్పంగా వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసి వేస్తున్నారు. ఈ మార్పులో భాగంగా ప్రస్తుత ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచారు. ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం ఉన్న చోట మరో గేటును ఏర్పాటు చేస్తారు. సచివాలయంలోని మిగిలిన గేట్లను యథావిధిగా ఉంచనున్నారు.