InternationalNewsNews Alert

కెనడాలో ఏఆర్‌ రెహ్మాన్‌ వీధి..!

సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌కు అరుదైన గౌరవం లభించింది. తన సంగీతంతో దేశంలో కోట్లాది మంది సినీ ప్రియులకు అభిమాన పాత్రుడయ్యారు. తమిళం నుంచి ఇంగ్లీషు వరకు అన్ని భాషల్లోనూ సంగీతాన్ని అందించిన రెహ్మాన్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఎక్కువే. ఆ అభిమానం ఎంతగా పెరిగిందంటే.. కెనడా దేశంలోని ఓ వీధికి ఏఆర్‌ రెహ్మాన్‌ పేరు పెట్టేంత. కెనడాలోని మార్కమ్‌ అనే పట్టణంలో ఓ వీధికి 2013లోనూ రెహ్మాన్‌ పేరు పెట్టారు. ఇప్పడు అదే పట్టణంలో మరో వీధికి రెహ్మాన్‌ పేరు పెట్టడం విశేషం. దీనిపై ఆయన స్పందిస్తూ.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సినీ ప్రపంచంలో తాను ఓ చిన్న నీటి బొట్టును అన్నారు. తనకు ఇంతటి గౌరవం దక్కుతుందని ఏనాడూ ఊహించలేదని సంతోషంగా చెప్పారు. తనకు అండగా నిలిచిన ప్రతి భారతీయుడికీ కృతజ్ఞతలు తెలిపారు.