ఏపీ జవాన్ సమయస్పూర్తి..30 మందిని కాపాడి వీరమరణం..
ఏపీకి చెందిన జవాన్ హవాల్దార్ వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని ఎల్‌ఎసీ వద్ద పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి 30 మందిని కాపాడారు. ఎల్‌ఎసీ వెంట 30 మందితో కలిసి పెట్రోలింగ్ చేస్తూ ‘ల్యాండ్ మైన్’పై కాలు పెట్టారు. దీనిని గమనించిన సుబ్బయ్య, తన తోటి సైనికులు ప్రమాదంలో పడకుండా వారిని హెచ్చరిస్తూ ‘గో బ్యాక్’ అంటూ గట్టిగా అరిచారు. అనంతరం అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే మరణించారు.