‘నోటికొచ్చినట్లు మాట్లాడితే వాతలే’..హోంమంత్రి అనిత
వైసీపీ నేతలు మాధవ్, పోసాని కృష్ణమురళిలను ఉద్దేశించి ఏపీ హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పాత ప్రభుత్వం కాదని, నోటి కొచ్చినట్లు బూతులు మాట్లాడి, ప్రజలను రెచ్చగొడితే వాతలు పెడతామని, చట్ట పరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అలాంటి మాటలకు ఆస్కారం లేదన్నారు. అలాగే గోరంట్ల మాధవ్ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోందని చేసిన వ్యాఖ్యలనుద్దేశించి కూటమిలో అంతర్యుద్ధం లేదని, వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా చూసుకోమని కౌంటర్ వేశారు. కక్ష పూరిత రాజకీయాలకు ఆస్కారం లేదని, పోసాని సభ్య సమాజం తలదించుకునేవిధంగా వ్యాఖ్యలు చేశారని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అతనిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని తెలిపారు.