ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖ, అక్కడే ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
ఏపీ రాజధానిగా ఎన్నికల తర్వాత విశాఖ ఉంటుందన్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. విశాఖను రాజధానిగా చేయడం వెనుక తనకు వ్యక్తిగత స్వార్థం లేదన్నారు జగన్. అమరావతి సహా తాను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదన్నారు. అమరావతి శాసనరాజధానిగా కొనసాగుతుందన్నారు. అమరావతిలో మౌలిక సదుపాయల కోసం లక్ష కోట్లు కావాలన్నారు. నాయకుడికి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ధి జరగదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచి పాలన సాగిస్తానన్నారు. విశాఖ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్నారు.

విశాఖను ఎకనామిక్ గ్రోత్ కారిడార్‌లా మార్చుతానన్నారు జగన్. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తానన్నారు. మళ్లీ గెలిచి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. విశాఖ నగరంలో అన్ని సౌకర్యాలను తీసుకొస్తామన్నారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తామన్నారు. మెట్రో రైల్ లేని ఒకే ఒక్క నగరం విశాఖ అన్నారు జగన్. పీపీటీ మోడల్లో మెట్రో రైల్ నిర్మాణం కోసం తాము ప్రయత్నిస్తామన్నారు.


