నేడు ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో క్యాబినెట్ భేటీ
బడ్జెట్ సమావేశాల అనంతరం సుదీర్ఘకాలం తర్వాత ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం కానుంది. సాధారణ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన రెండు రోజులలోనే క్యాబినెట్ సమావేశం తొలుత నిర్వహించాలనుకున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నవరత్నాల అమలు, అందరికీ న్యాయం, హామీల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో ఇంకా చేయాల్సిన మిగులు కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గడపగడపకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాలపై ప్రజాస్పందన తదితరాంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ప్రధానంగా ప్రభుత్వం చెబుతున్న సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల సంతృప్తికరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు ప్రభుత్వ గమనించింది. ఆ వర్గాలను సంతృప్తి పరిచేందుకు సోమవారం మంత్రివర్గ ఉప సంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించి వారికి ఈ క్యాబినెట్లో తీపి కబురు అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే 12వ పి.ఆర్.సి పై ప్రకటన ఓపిఎస్ స్థానంలో ఉద్యోగ వర్గాలకు మేలు జరిగే విధంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే రాజధాని భూములు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపద్యంలో విత్తనాలు ఎరువులు అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో అమలు కానున్న జాతీయ విద్యా విధానం పలు పరిశ్రమలు సంస్థలకు భూముల కేటాయింపు తదితరాంశాలపై క్యాబినెట్లో చర్చకు రానున్నాయి.