Andhra PradeshNews Alert

నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం

నేడు ఏపీ క్యాబినేట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు రాజధానుల అంశంపై చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా సీపీఎస్ అంశంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి.  దేవాదాయ శాఖ నియామకానికి సంబంధించి రెవెన్యూ అధికారులను నియమించే అంశంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అసెంబ్లీలో 85 పోస్టుల మంజూరు పై ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎయిడెడ్ విద్యాసంస్థ, గ్రంథాలయ సంస్థ సిబ్బందికి 62 ఏళ్ల పదవీ విరమణ అనే పలు అంశాలను కూడా ఏపీ క్యాబినెట్‌లో చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.