Andhra PradeshNews Alert

ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ

AP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌లో వెల్లడిచేస్తారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ విధానం గురించి, కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నిర్ణయాలు, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపుపై నిర్ణయం, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణంతో సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.