ఏపీలో 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
ఏపీలో ఇవాళ ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది. కాగా 4 గంటలపాటు కొనసాగిన ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 హామీలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా మెగా డీఎస్సీ,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ,పెన్షన్ల పెంపు,స్కిల్ సెన్సస్,వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పోలవరం, అమరావతి, లిక్కర్, ఫైనాన్స్, మైనింగ్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా ఈసారి ఏపీలో సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్ పంపిణీ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

