గద్దర్ నరహంతకుడు..
పద్మ అవార్డుల ప్రకటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాయుద్ధ నౌక, ప్రజానాయకుడు గద్దరు ఎల్ టీటీఈ ప్రభాకరన్, నయీమ్ తో పోల్చారు. ‘గద్దర్ పై అనేక కేసులు ఉన్నాయని.. ఎంతోమంది ప్రాణాలు తీసిన నరహంతకుడతను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకి. గద్దర్ మావోయిస్టుకు చెందిన లీడర్. రాజ్యాంగాన్ని విశ్వసించని ఆయనకు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. గద్దర్ కుమార్తె కాంగ్రెస్ లో ఉన్నారని ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలా? రాజీవ్ గాంధీని చంపిన వారికి కూడా పద్మ అవార్డులు ఇవ్వమంటారా రేవంత్ ?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.