Andhra PradeshHome Page Slider

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం

ఏపీలో మరికాసేపట్లో ఏపీ బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. దీంతో  సీఎం ఇప్పటికే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. కాగా ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు,సంక్షేమ పథకాల అమలు,రుణ లక్ష్యాలపై ప్రధానంగా సీఎం అధికారులతో చర్చించనున్నారు. అంతేకాకుండా గృహనిర్మాణాల కోసం గతంలో తీసుకున్న రుణాలపై కూడా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.