Home Page SliderInternational

పాకిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ ఆర్మీ కంటోన్మెంట్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలు నిండిన వాహనాలతో బన్నూ కంటోన్మెంట్‌ గోడల్ని ఢీ కొట్టడం వల్ల పేలుడు సంభవించింది. ఘటనాస్థలి పెషావర్ కు 200 కిలో మీటర్ల దూరంలో ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో ఉందని పోలీసులు వెల్లడించారు. పేలుడు తర్వాత గోడను బద్దలు కొట్టి చాలా మంది ఉగ్రవాదులు కంటోన్మెంట్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారన్నారు. భద్రత దళాలు వారిని అడ్డుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాక్ సైన్యం ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి కంటోన్మెంట్ కు సమీపంలో ఉన్న సాధారణ పౌర ఆవాస భవనాల్లో అయిదుగురు మరణించారని వెల్లడించారు.