వరల్డ్ కప్‌కు భారత్ నుండి మరో స్టార్ ప్లేయర్ దూరం
T20 వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కాగా మరో స్టార్ ప్లేయర్ టీవిండియా WCకు దూరమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్స్ బుమ్రా , జడేజా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా దీపక్ చాహర్ కూడా గాయం కారణంగానే మ్యాచ్ ఆడటం లేదని ఇన్‌సైడ్ స్పోర్ట్ వెల్లడించింది. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేతో చాహర్ గాయపడ్డాడు. దీంతో ఇతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.