Home Page SliderInternational

మరోసారి అమెరికాలో కాల్పులు కలకలం

మరోసారి అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు కలకలం రేపింది. వర్సిటీలోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ కాల్పులకు పాల్పడింది లియోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ జెస్సికా ఇక్నర్ కుమారుడు.. 20 ఏండ్ల ఫీనిక్స్ ఇక్నర్ అని సమాచారం. ఇక్నర్ తన తల్లికి చెందిన మాజీ సర్వీస్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా.. పోలీసులు ఇక్నర్ ను అదుపులోకి తీసుకున్నారు.