వల్లభనేని వంశీకి మరో షాక్..
వైసీపీ నేత వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. నేడు ఈ కేసుపై విచారణ జరగగా, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. దీనితో వంశీకి ఈ కేసులో ఇంకా ఊరట లభించలేదు.