Home Page SliderTelangana

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్

ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కాగా ఇటీవల బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు పార్టీలో టికెట్ దక్కలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా బీఆర్ఎస్ పార్టీ మొన్న ప్రకటించిన జాబితాలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే  ఉప్పల్ టికెట్ బండారి లక్ష్మారెడ్డికి దక్కగా..కవిత హామీతో సుభాష్ రెడ్డి చల్లబడ్డారని అందరు భావించారు. సుభాష్ రెడ్డి  ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఆయన తాజాగా బీజేపీ ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు బీజేపీ పార్టీ కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.