HealthHome Page SliderNational

పతంజలికి మరో షాక్

పతంజలి సంస్థకు చెందిన 4 టన్నుల కారం పొడిని నిరాకరించింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనితో ఈ సంస్థకు పెద్ద షాక్ తగిలింది. పతంజలి కారం పొడిలో ఒక బ్యాచ్‌కు చెందిన కారం పొడిని ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా లేదని మార్కెట్లో అమ్మకూడదని ఆదేశించింది. ఆ మేరకు 4 టన్నుల కారం పొడిని వెనక్కి రప్పించింది పతంజలి సంస్థ. ఇప్పటికే కొన్నవారికి డబ్బు వాపసు తీసుకోవచ్చని ప్రకటించారు.