లాల్ సింగ్ చడ్డాకు మరో ఎదురుదెబ్బ
లాల్ సింగ్ చడ్డా మూవీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆగఘ్ట 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా , కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. మూవీ రీలీజ్ కాకముందు నుండి ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన రీలీజ్ అయిన తర్వాత ఈ ప్రచారాలన్ని కొట్టుకుపోతాయని భావించారు. కానీ సినిమా అంత ఆసక్తికరంగా లేనందున కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఈ మూవీకి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్ ఇచ్చింది. ఓటీటీ రైట్స్ కోసం రూ. 200 కోట్లతో మొదట ఒప్పందం కుదుర్చుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ దానిని రద్దు చేసుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికే అనుకున్న కలెక్షన్స్ రాక పడిపోయిన మూవీ టీమ్‌కు.. ఈ డీల్ క్యాన్సిల్ కావడం పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా మూవీని అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా దీనిని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పించారు.

