మరో అరుదైన ఘనత సాధించిన యంగ్ టైగర్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించారు. కాగా ఇటీవల ఏషీయన్ వీక్లీ మ్యాగజైన్ ఆసియాలో టాప్-50 నటుల జాబితాను ప్రకటించింది. కాగా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ చోటు దక్కించుకున్నారు. అయితే ఈస్టర్న్ ఐ 2023 పేరిట వెల్లడించిన ఈ జాబితాలో తారక్ 25వ స్థానం సొంతం చేసుకున్నారు. కాగా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ టాప్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఈ జాబితాలో మరికొందరు బాలీవుడ్ స్టార్లు కూడా నిలిచారు. అయితే ఇటీవల వచ్చిన వెరైటీ మ్యాగజైన్‌లోనూ ఎన్టీఆర్ తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాగజైన్లలో టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చోటు దక్కించుకోవడం ప్రసంశించదగ్గ విషయం.కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా “దేవర” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తున్నారు.