బాహుబలి, కేజియఫ్ కాంబోలో మరో మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే కేజీయఫ్-1,2లతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ కాంబినేషన్‌లోనే మరో మూవీ ఉంటుందని నిర్మాత దిల్‌రాజు తాజాగా వెల్లడించారు. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ఇప్పటికే సిద్ధం అయినట్లు దిల్‌రాజు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటున్న “సలార్” మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల నుందుకు రానుంది.