మరోమారు హైడ్రా కొరడా..
హైదరాబాద్‌లో కొంతకాలం విరామం అనంతరం హైడ్రా మళ్లీ కొరడా ఝలిపిస్తోంది. మేడ్చల్ జిల్లా ప్రాంతంలోని యాప్రాల్‌లో నేడు అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టింది. అక్కడ ఒక ఫంక్షన్ హాలును తాజాగా కూల్చివేసింది. ప్రభుత్వ భూమిలో ఈ ఫంక్షన్ హాలు అక్రమ నిర్మాణం చేసినట్లు గుర్తించారు. ఇక్కడ జవహర్ నగర్ ప్రాంతంలో చాలా వరకూ భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో హైడ్రా రంగంలో దిగింది.