ఆసుపత్రిలో చేరిన మనీశ్ సిసోడియా భార్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ నేత మనిశ్ సిసోడియాకు మరో కష్టం వచ్చి పడింది. ఆయన భార్య సీమా సిసోడియా(49) తీవ్రమైన వ్యాధితో మంగళవారం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. న్యూరాలజీ విభాగంలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆమె ఆరోగ్య పరిస్థితిని విచారిస్తున్నారు. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, పది లక్షలమందిలో ఒకరికి సోకే ఈ వ్యాధితో మెదడు శరీరంలోని ఇతర భాగాలపై నియంత్రణ కోల్పోతారని వైద్యులు చెప్పారు. సిసోడియా కుమారుడు విదేశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్ స్కామ్‌లో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. కాగా ఆయన తన భార్యకు అనారోగ్యం వల్ల బెయిల్ మంజూరు చేయమని కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను ఈవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

