accidentBreaking NewsHome Page Sliderhome page sliderInternationalNewsNews AlertTrending Todayviral

మరో ఘోర విమాన ప్రమాదం..50 మంది మృతి

రష్యాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 50 ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్ లైన్స్ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 50 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. సుమారు 50 మందితో(44 మంది ప్రయాణికులు(ఐదుగురు చిన్నారులు సహా), ఆరుగురు సిబ్బంది) టిండా ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే గమ్యస్థానానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఈస్ట్రన్ అమూర్ రీజియన్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో (ఏటీసీ) సంబంధాలు తెగిపోయింది. దీంతో విమానం అదృశ్యమైనట్లు ప్రకటించిన అధికారులు.. దాని ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయితే.. కాసేపటికే అమూర్ రీజియన్ లోని దట్టమైన అడవుల్లో విమాన శకలాలను గుర్తించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.