కుంభమేళాలో మరో అపశృతి..చెలరేగిన మంటలు
మహా కుంభమేళాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. వీటి కారణంగా అనేక టెంట్‌లు దగ్ధమయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పలువురు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్ననే మౌని అమావాస్య సందర్బంగా భారీ తొక్కిసలాట జరిగి 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. యూపీ సర్కార్ ఇలాంటి ప్రమాదాలు అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్య ఘాట్‌ల వద్ద రద్దీని తొలగించేందుకు అనేక మార్పులు చేశారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ఫిబ్రవరి 4 వరకూ నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. వీవీఐపీ పాస్‌లను రద్దు చేశారు.