Home Page SliderTelangana

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరో అవార్డు

హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తన అద్భుతమైన డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ‘సౌదీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిబిషన్-2024′ సందర్భంగా ప్రతిష్టాత్మక ‘ఎయిర్ పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్’లో టాప్ హానర్స్ ను గెలుచుకుంది. సౌదీ అరేబియాలోని రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. జీహెచ్ఐఏఎల్ అభివృద్ధి చేసి అమలు చేసిన అనేక
కొత్త సృజనాత్మక పరిష్కారాలలో, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో డిజిటల్ ట్విన్ విజేతగా నిలిచింది. ఎయిర్ పోర్ట్ రెవెన్యూ మేనేజ్ మెంట్ విభాగంలో స్మార్ట్ ట్రాలీ రన్నరప్ గా నిలిచింది.