Home Page SliderNationalNews Alert

కుంభమేళా ఖాతాలో మరో ప్రమాదం..6గురు మృతి

యూపీలోని ప్రయాగలో మహా కుంభమేళాకు కోట్లాది మంది హాజరవుతున్నారు. ఈ క్రమంలో తొక్కసలాటలు, అగ్నిప్రమాదాలు అడపా దడపా జరుగుతున్నాయి. అయితే నేడు కుంభమేళా నుండి భక్తులతో తిరిగి వస్తున్న వాహనాన్ని ఒక ట్రక్కు అదుపు తప్పి ఢీకొట్టింది. యూపీలోని ఘాజీపూర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ఈ వాహనంలో 20 మంది ఉన్నారని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. అతడి కోసం  నంద్‌గంజ్ పోలీసులు గాలిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రజలు సహాయక చర్యలు అందిస్తున్నారు.