మరో 10 వ తరగతి ప్రశ్నాపత్రం లీక్
ఈ మధ్య కాలంలో తెంలగాణాలో TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహరం రాష్ట్రంలో సృష్టించిన విధ్యంసం అంత ఇంత కాదనే చెప్పాలి. ఈ లీకేజీతో తెలంగాణా రాష్ట్రం ఆందోళనలు,నిరసనలతో హొరెత్తింది. ఆ సంఘటన మరువక ముందే నిన్న 10 వ తరగతి తెలుగు పేపర్ వాట్సప్‌లో చక్కర్లు కొట్టడం విద్యార్థులు,తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. కాగా దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఈ తెలుగు పేపర్ లీక్ చేసిన నలుగురి వ్యక్తులను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఈ ప్రశ్నా పత్రాల లీకేజీని మాత్రం అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ఈ రోజు 10 వ తరగతి హిందీ పేపర్ కూడా వాట్సప్ గ్రూప్స్‌లో ప్రత్యక్షమవ్వడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగా ఈ రోజు ఉదయం 9:30 నిమిషాలకు హిందీ ప్రశ్నాపత్రం వాట్సప్ గ్రూపుల్లో కనిపించినట్ల తెలుస్తోంది. పలు వాట్సప్ గ్రూపుల్లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ప్రతిరోజు తెలంగాణాలో 10 వతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతూ ఉండడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు. మరోవైపు దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

