Home Page SliderNews AlertTelangana

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. రాచకొండ సీపీగా డీఎస్‌ చౌహాన్‌, ఏసీబీ డీజగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. లా అండ్‌ ఆర్డర్‌ డీజీగా సంజయ్‌ కుమార్‌ జైన్‌ను నియమించింది. హోంశాఖ కార్యదర్శిగా జితేందర్‌ కొనసాగనున్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి ఈ నెల 31 పదవీ విరమణ చేయనున్నారు.