మీ దగ్గరుంటే ఆణిముత్యం…బయటికొస్తే నక్సలైటా?
రేవంత్ సర్కార్‌లో నక్సలైట్లున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క మండిపడ్డారు.గతంలో తనకు భారతీయ జనతా పార్టీ పలు ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందని,అప్పుడు తాను నక్సలైట్ అని ఎందుకు గుర్తుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు.మీ దగ్గర ఉంటే ఆణిముత్యం…బయటకి వచ్చేస్తే నక్సలైట్ అని ముద్ర వేస్తారా అని ధ్వజమెత్తారు. తాను మావోయిస్టు నుంచి సాధారణ పౌరురాలిగా చానాళ్లు ప్రజా జీవితం గడిపానని,తర్వాత లా కోర్సు చేసి లాయర్ గా ప్రాక్టీస్ కూడా చేశానన్నారు.తనని మంత్రి వర్గంలో లేకుండా చేయడానికి బీఆర్ ఎస్ ,బీజెపిలు కుట్ర పన్నాయని విమర్శించారు. భాజపాలో పెద్ద నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్, మొన్నటివరకు పార్టీలో ఉన్న బుడిగే శోభక్కలది నక్సల్స్ భావజాలం కాదా? సంజయ్ అంటూ సీతక్క ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో మాజీ మావోయిస్టులకు మీరు ఎన్నికల టికెట్లు ఇవ్వలేదా? బండి సంజయ్ తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

