Andhra PradeshNews Alert

ఏపీలో టీచర్స్ ఫెడరేషన్ అనూహ్య నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయసంఘాలు ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చాయి. రాబోయే సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు సెప్టెంబరు 5న ప్రభుత్వ సన్మానాలు, సత్కారాలు కూడా తిరస్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుల అక్రమ నిర్భందాలు, బైండోవర్లను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బయో హాజరు విషయంలో ఫేస్‌యాప్‌పై  విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆదేకాక సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉపాధ్యాయసంఘాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. సొంత ఫోన్లలో ఫోటోలతో హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని, ఉపాధ్యాయుల వ్యక్తిగత భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని, అందుకే తమ వ్యతిరేఖతను ఈ విధంగా తెలియజేస్తున్నామన్నారు.