Andhra PradeshHome Page Slider

ఆంధ్రప్రదేశ్ ను ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మార్చేశారు..

ఆంధ్రప్రదేశ్ ను ‘అత్యాచారాంధ్రప్రదేశ్’గా మార్చేశారన్నారు వైసీపీ నేత రోజా. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై మాజీ ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మృతురాలి తల్లి భోరున విలపిస్తున్న వీడియోను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోదిస్తున్న ఆ కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.