NewsNews AlertTelangana

సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించిన యాంకర్‌ అనసూయ..

సినీనటి బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌  సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించారు. సినిమాల్లో మంచి మంచి పాత్రలో నటించడమే కాకుండా బుల్లితెరపై యాంకర్‌గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.ఇదిలా ఉండగా యాంకర్ అనసూయ సైబర్ క్రైమ్ పోలిసులను ఆశ్రయించారు. అయితే గత కొన్ని రోజులుగా అనసూయను సోషల్ మీడియాలో ‘ఆంటీ’ అంటూ మీమ్స్‌, కామెంట్స్‌తో నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఇదంతా కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆంటీ అంటూ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో పోస్టులతో అసభ్యకరమైన కామెంట్స్‌తో ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. నెటిజన్లు‌పై మండిపడ్డారు. ఇలా అసభ్యకరమైన కామెంట్ చేసిన మీమ్స్ పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె ఈ మధ్య వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయినా కొందరు ఆమె టార్గెట్ చేసిన నెటిజన్లు ఇంకా రెచ్చిపోయారు. దీంతో ఆమె సైబర్క్రైమ్‌‌ పోలిసులను ఆమెపై ట్రోలింగ్ చేసిన వారపై చర్యలు తిసుకోమని ఫీర్యాదు చేశారు. ఫీర్యాదుకి సంబందించిన మెసేజ్‌ను స్కీన్‌షార్ట్‌ను తీసి ఆమె ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఈ విధంగా రాసుకోచ్చారు..’నాపై ట్రోల్స్ చేసే వారిపై చర్యలు తీసుకునే ప్రోసెస్‌ మొదలైంది, ఇంత వరకు వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోని ఫిర్యాదు చేయాలేదని, అయినా ట్రోల్స్‌ చేయటం ఆపకపోవటంతో ఈ పని చేయకా తప్పటంలేదన్నారు, మీకు దీనిపై ఆప్‌డేట్స్‌ ఇస్తాను, మీరు ఉహించిన దానికంటే ఇది పెద్దది అంటూ రాశారు. అయితే ఆమె తాజాగా ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదని..కర్మ కొన్నిసార్లు రావటం లేటవచ్చేమోగాని, రావటం మాత్రం పక్కా అంటూ ఈ నెల 21 న ఆమె ట్వీట్‌ చేసిన దానిపై నెటిజన్లు తమ హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి అన్నదని అనుకొని, అతని అభిమానులు అనసూయను అంటీ అంటూ కొందరు నెటిజన్లు అవమానిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.