ఆమె టాలెంట్‌కు ఆనంద్ మహేంద్రా ఫిదా- బంపర్ జాబ్ ఆఫర్
ఒకొక్కరిలో ఒక్కో రకమైన టాలెంట్ దాగి ఉంటుంది. ఒక్కొక్కసారి అది కంటపడాల్సిన వారి కంట పడితే వారి జీవితమే మారిపోతుంది. మహీంద్రా టెక్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. టాలెంట్ ఉన్నవాళ్లని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాగే ఒకమ్మాయి టాలెంట్ ఆయన కంటపడింది. నీకు జాబ్ ఇవ్వడానికి సిద్దమేనంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. స్టాప్‌లర్ పిన్స్‌తో అందంగా అమరిక చేస్తూ ఒక కారుబొమ్మ తయారు చేసింది. గమ్మత్తేమిటంటే ఎలాంటి గమ్, ఫెవికాల్ వంటివి ఉపయోగించకుండానే వాటిని ప్రెస్ చేస్తూ అలవోకగా ఈ కారు తయారు చేసేసింది చక్రాలతో సహా. దీనితో ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా చాలా సృజనాత్మకంగా ఇది తయారు చేసిందని, తాను మహీంద్రా కారు కంపెనీలో పని చేయాలనుకుంటే జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆమె టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.

