InternationalNews Alert

పుతిన్‌కు ఊహించని షాక్

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలకి ఇప్పటికే ఎంతో ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికి వరకు జరిగిన పోరులో రష్యా తన దూకుడు చూపించింది. కానీ తాజాగా పుతిన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. రష్యాకు సంబంధించిన ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునట్టు తెలిపింది. ఖర్కివ్ రష్యాలోనే భారీ నగరాల్లోనే రెండవ నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటువంటి నగరాన్ని ఉక్రెయిన్ తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఈ వార్తతో జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇది మాత్రం రష్యాకు తీవ్రమైన దెబ్బనే చెప్పాలి. దీంతో రష్యా తోకముడిచిందనే చెప్పవచ్చు.