తలలోకి దూసుకుపోయిన ఇనుప పైపు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎస్సీ బాలికల హాస్టల్లో ప్రమాదం చోటు చేసుకుంది.హాస్టల్ భవనంలో అంతర్గత శ్లాబ్‌కి ఉన్నఇనుప కడ్డి ఊడి విద్యార్ధి తలపై పండింది.సన్నని ఇనుప పైపు కావడంతో విద్యార్ధి తలలోకి దూసుకెళ్లింది..దాంతో విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి తలలో ఇరుక్కుపోయిన ఇనుప ముక్కలను తొలగించారు.

