Home Page SliderInternationalNationalSports

18 ఏళ్ల నిరీక్షణకు తెర..భావోద్వేగానికి గురైన కోహ్లి.

ఐపీఎల్ 2025గా ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిలిచింది. ఆ క్షణం అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఎందుకు అంటే ఈ గెలుపు వారి సుదీర్ఘ నిరీక్షణ ఫలితం..ముఖ్యంగా విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు నిన్నటి ఐపీఎల్ ఫైనల్ పండుగలా అనిపించింది. ఎందుకంటే విరాట్‌ కోహ్లీ.అంటే ఆర్సీబీ,ఆర్ఫీబీ అంటే విరాట్ కోహ్లి అనే స్థాయికి అతడి బ్రాండ్‌ చేరిందంటే జట్టులో ఎంత విలువైన ఆటగాడో ఆర్ధం చేసుకోవచ్చు. ఆ జట్టు ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు అతడే. ఎన్నో ఏళ్లు ఆ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ… … చిరస్మరణీయ విజయాలు అందించినప్పటికీ… టైటిల్‌నుమాత్రం చేరుకోలేకపోయాడు.

ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లి చావో, రేవో అనే తరహాలో ఫైనల్స్ కోసం పోరాడాడు. ఈ స్థితిలో గెలుపు సాధించి అంతులేని భావోద్వాగానికి గురయ్యాడు. తనలో తానే ఆత్మవిశ్వసం నింపుకొని ముందుకుసాగాడు. ఈ 18వ సీజన్‌ను దూకుడుగా ప్రారంభించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. చివరికి కప్పును చేతపట్టాడు. ఫైనల్‌లో విజయం సాధించగానే విరాట్‌ మైదానంలో కుప్పకూలి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ భావోద్వేగం వెనక ఎన్నో ఏళ్ల సుదీర్ద నిరీక్షణ ఉంది. అందుకే చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీని ఇలా చూసిన అభిమానులు…నిజమైన హీరో అంటే కోహ్లీ అని అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన కోహ్లీ… ఇప్పుడు తన సుదీర్ణ స్వప్నం అయిన ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడి తన కెరీర్‌లోని లోటును పూడ్చుకున్నాడు. ఎట్టకేలకు ఐపీఎల్‌ ట్రోఫీ విరాట్‌ ఖాతాలో చేరడంతో తన కెరీర్‌ పరిపూర్ణం అయ్యింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానుల సంబరాలు కూడా అంబరాన్నంటాయి. చివరి బంతికి పంజాబ్‌పై విజయం సాధించగానే.. కోహ్లీ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక మైదానంలోనే కుప్పకూలాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాల్లో మునిగితేలాడు. అనంతరం ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అతడి భార్య అనుష్క శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సమయంలో అతడి కన్నీళ్లను తుడిచి ఆమె ఓదార్చుతూ కనిపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కోహ్లీ… ఆర్ఫీబీ మాజీ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ తదితరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలవడం నమ్మశక్యం కాని భావన అని…ఈరోజు వస్తుందని అనుకోలేదని కోహ్లీ అన్నాడు. చివరి బంతి పడ్డాక తాను భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయానని.. ఇదొక గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు